![]() |
![]() |
.webp)
ఇప్పుడు ఉన్న కామెడీ షోస్ "జబర్దస్త్" ని కొట్టేది మరేదీ లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ స్టార్స్ అయ్యారు. అంతేకాదు ఈ షో ఎంతో మందిని కలిపింది. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్-రష్మీ జంట ఒకటి. తర్వాత వర్ష-ఇమ్మానుయేల్ జంట మరొకటి. వీళ్ళు తమ కామెడీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఐతే వర్షకి సంబంధించిన ఒక సీక్రెట్ ఇప్పుడు బయటపడింది. వర్షకి మరో లవ్ స్టోరీ ఉందట. ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. బండారం బయట పడేసరికి వర్ష షాకయ్యింది.
ఐతే వర్ష, ఇమ్ము తమ ప్రేమ విషయాన్ని తల్లితండ్రులకు చెప్పడంతో వర్షా వాళ్ళ నాన్న ఒక సలహా ఇచ్చాడు. అదేంటంటే ప్రేమికులిద్దరూ ఒక రోజు పాటు తమ సెల్ ఫోన్స్ మార్చుకోవాలి అని కండిషన్ పెట్టాడు. ఇలా సెల్ ఫోన్స్ మార్చుకున్నప్పుడు వర్ష లవ్ స్టోరీ సీక్రెట్ బయట పడిపోయింది. టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్, ఫేస్ బుక్ ల్లో చాట్ చేస్తే తెలిసిపోతుందని తెలివిగా ఫోన్-పే లో చాట్ చేస్తోంది. ఇక ఈ విషయం తెలిసి ఇమ్ము షాకయ్యాడు. ఆమె బండారాన్ని వర్ష వాళ్ళ నాన్న బులెట్ భాస్కర్ కి చెప్పేస్తాడు. ఇప్పుడు వర్షకి ఉన్న లవ్ అఫైర్స్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదంతా చూస్తే గనక నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే "ఎక్స్ట్రా జబర్దస్త్" స్కిట్ లో ఒక భాగం. దీనికి సంబంధించిన ప్రోమో ద్వారా వర్ష లవ్ టాపిక్ బయటపడిపోయింది.
ఐతే రీసెంట్ గా వచ్చిన తమిళ్ మూవీ "లవ్ టుడే" మూవీ కాన్సెప్ట్ ని తీసుకుని స్పూఫ్ గా చేసి చూపించారు. ఏదేమైనా ఈ స్కిట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనుంది.
![]() |
![]() |